గుంటూరు: తన మీద ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో రికార్డ్ స్థాయి మెజారిటీ ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి ప్రతీ క్షణం ప్రజలతో మమేకమవుతూ ఎంతో కష్టపడుతున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ ల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందిన మొదటి సంవత్సరంలోనే సమర్ధవఃంతమైన ప్రజా నాయకురాలిగా గళ్ళా మాధవి వినుతికెక్కారని కొనియాడారు. బుధవారం గళ్ళా మాధవి పుట్టినరోజు సందర్బంగా 22 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చింతకాయల వెంకట సాయి ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకలకు అయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ గెలిచిన క్షణం నుంచి ప్రజా క్షేత్రంలోనే ఉంటూ ఇటు నగరాభివృద్ధి, అటు సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నారన్నారు. పదిహేను నెలల కాలంలోనే నియోజకవర్గం పరిధిలో వంద కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం గళ్ళా మాధవి సమర్ధవంతమైన నాయకత్వానికి నిదర్శనమన్నారు. అనతికాలంలోనే ఎవరూ ఊహించని స్థాయిలో అప్రతిహతంగా రాజకీయంగా దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో పాటూ భగవంతుని ఆశీర్వాదాలు సదా గళ్ళా మాధవికి ఉండాలని ఆ దేవదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆళ్ళ హరి తెలిపారు. తొలుత శ్రీనివాసరావుతోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గళ్ళా మాధవి దంపతుల పేరు మీద స్వామి వారికీ ప్రత్యేక అర్చన చేసారు. అనంతరం 60 అడుగుల రోడ్డు పీర్లచావిడి సెంటర్లో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చుతూ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో కూటమి నేతలు చింతకాయల నరసింహారావు, షేక్ నాగూర్ వలి, యర్రిబోయిన శ్రీనివాసరావు, మాబు సుభాని, షేక్ సుభాని, బీజేపీ బాబు, బద్రి నాగలక్ష్మి, వేముల పేరయ్య, లక్ష్మణ బాషా, గొట్టిపాటి రమేష్, షేక్ అబ్దుల్ కరీం, గంధం బాబ్జి, సుగ్గాల నగేష్ బాబు, బద్రిశెట్టి రాంబాబు, మల్లవరపు శ్రీధర్, కోలా మల్లికార్జునరావు, షేక్ అఖిల్, అడపా సుందరరావు, అనిమిశెట్టి రాజ్య లక్ష్మి, నెల్లూరు శ్రీనివాసరావు, దేశిబోయిన పోతురాజు, కొర్రపాటి శివ కుమార్, షేక్ అబ్దుల్ జిలానీ, షేక్ మస్తాన్ వలి, స్టూడియో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment