గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 33వ రోజు

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ గిరిసేన జనసేన- జనం వద్దకు- జనసేన 33 వ రోజు పర్యటనలో భాగంగా రేగులపాడు పంచాయతీ బొడ్లపాడు గ్రామంలో జనసేన ఎంపీటీసీ అభ్యర్థి జనసేన జానీ పర్యటన చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ బొడ్లపాడు గ్రామంలో ఊరుకి ఎటువైపు చుసినా సరే చాలా దారుణంగా బురదతో చెత్త చేదారంతో ఎక్కడ గుమ్ములు అక్కడే బురద, నీరు స్టాక్ అవ్వడం ఊరులో కొన్ని వీధులలో కాలువలు కూడా లేకుండా రోడ్లు వెయ్యకపోవడం వల్లన నీరు అనేది ఎక్కడికి అక్కడే ఉండిపోవడం వలన నడవటానికే భయంకరంగా ఉన్నది దాని వల్లన మలేరియా డెంగ్యూల బారిన పడి అనేకమైన రోగాలు కూడా దారితీస్తున్నాయి. కనుక ఊరు అభివృద్ధి బాధ్యత గెలిచే నాయుకులకి ఉన్నది అని బొడ్లపాడు జనసేన ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి జనసేన జానీ గుర్తు చేస్తున్నారు.