నాన్నతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం..

”ఆచార్య’ సినిమాలో నాన్నతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ‘సిద్ధ’ పాత్రలో నటిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇందులో నాది అతిథి పాత్ర కాదు. నా వరకూ ఇది పూర్తి నిడివి ఉన్న పాత్ర. నాన్న సినిమాలో నటించడానికి నాకు అవకాశం కల్పించిన దర్శకుడు కొరటాల శివకు ధన్యవాదాలు’ అని రామ్‌చరణ్ అన్నారు.

తన తండ్రి, మెగాస్టార్‌ చిరంజీవితో స్ర్కీన్ పంచుకోవడం అదృష్టమని నటుడు రామ్‌ చరణ్‌ తేజ్‌ అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్‌ ‘ఆచార్య’ టీజర్ విడుదల సందర్భంగా మెగా పవర్ స్టార్ పై వ్యాఖ్యలు చేశారు. కాగా తాజాగా విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. కాగా సినిమా కోసం రామ్‌చరణ్‌ను ఎంపిక చేసుకోవడం గురించి కొరటాల స్పందిస్తూ.. ‘ఈ సినిమాలో ‘సిద్ధ’ పాత్రకు రామ్‌చరణ్‌ తప్ప వేరే ఎవర్నీ ఊహించుకోలేకపోయాను. ఈ ప్రాజెక్ట్‌కు, ఆ పాత్రకు ఆయనే సరైన న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు. చిరంజీవికి జోడీగా కాజల్‌.. చరణ్‌కు జంటగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు.