ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్

ప్రకాశం జిల్లా, మార్కాపురం, జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నుండి ఎస్టేట్ వెళ్ళు రోడ్డు మరియు రాయవరం గ్రామం బండారు నారాయణ కాలనీ నందు రోడ్ల అధ్వాన పరిస్థితి పై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రస్తుత వర్షాకాల సమయంలో ఎక్కువగా ప్రమాదాలకు గురి అవుతున్నట్లు, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు.