నిరుద్యోగుల కోసం గూగుల్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు

నిరుద్యోగులకు కోసం గూగుల్ సంస్థ ప్రత్యేక ఉపాధి కోర్సులను ప్రారంభించనున్నది. గూగుల్‌ సర్టిఫికేషన్‌ కోర్సెస్‌ పేరిట వీటిని త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఆరు నెలలు శిక్షణ ఇచ్చి పరీక్ష ఆధారంగా సర్టిఫికెట్లను అందజేస్తారు. వీటిని సాధారణ డిగ్రీలుగా పరిగణిస్తామని గూగుల్ పేర్కొంది.

ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ కోర్సులు నేర్చుకున్న తరువాత నేరుగా గూగుల్‌లో ఉద్యోగం పొందవచ్చు. లేకపోతే ఇతర సంస్థల్లో అయినా చేరడానికి గూగుల్ సహాయం చేస్తుంది. కోర్సులు నేర్చకోవడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు.

విద్యాసంస్థల్లో కాలం చెల్లిన సిలబస్ బోధిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ ఈ కోర్సులను ప్రారంభిస్తోంది. వీటితో సమయం కూడా ఆదా అవుతుందని తెలిపింది. అయితే ఈ కోర్సు ఫీజు ఎంత అన్నది మాత్రం వెల్లడించలదు.

రిటైల్, హాస్పిటాలిటి తదితర రంగాల వ్యాపార సంస్థల్లో ఉద్యోగాల కోసం తెలుసుకునేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు గూగుల్ గతేడాది జాబ్స్ ఫీచర్‌ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.