డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ఉద్యోగావకాశాలు..

తమిళనాడు వెల్లింగ్‌టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాప్ కాలేజీ (డీఎస్ఎస్‌సీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. తమిళనాడులోని వెల్లింగ్‌టన్‌లో ఉన్న ఈ కాలేజీలో గ్రూప్‌-సి సివిలియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో మొత్తం 83 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2-04, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-10, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌-07, సుఖాని-01, కార్పెంటర్‌-01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఆఫీస్,ట్రెయినింగ్‌)-60 పోస్టులను భర్తీ చేయనున్నారు.

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-2 దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. డిక్టేషన్, ట్రాన్స్‌క్రిప్షన్‌లో నైపుణ్యం ఉండాలి.

 లోయర్‌ డివిజన్‌ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్స్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

సుఖాని పోస్టుకు అప్లై చేసుకునే వారు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్విమ్మింగ్‌లో సర్టిఫికేట్, మంచి సెయిలింగ్‌ నాలెడ్జ్‌తోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.

కార్పెంటర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించారు.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఆఫీస్, ట్రెయినింగ్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేషన్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

ముఖ్యమైన విషయాలు..

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ది కమాండెంట్, డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్, వెల్లింగ్‌టన్‌(నీలగిరీస్‌)-643231, తమిళనాడు చిరునామకు పంపించాలి.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీగా 22.05.2021 నిర్ణయించారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.dssc.gov.inను సందర్శించండి.