పెన్షన్ల అమలు విషయంలో ప్రభుత్వం అలసత్వం వీడాలి: జనసేన

తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలలో ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొన్ని వేల వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ అప్లికేషన్లు పెండింగులో ఉన్నాయి. నియోజకవర్గంలో ఎంతో మంది అర్హులైన వారికీ పెన్షన్లు అందక చాలా ఇబ్బంది పడుతున్నారని, కొంతమందికి పెన్షన్ కార్డు ఉన్నా సరే వారి యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ కావడం లేదని, వృద్ధాప్య పెన్షన్లు వృద్ధులకు ఇస్తారని తెలిసినప్పటికీ రెండో అంతస్తులో సంబంధిత కార్యాలయం ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని, దయచేసి ఆ కార్యాలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రిసెప్షన్ వద్దకు మార్చవలసిందిగా విన్నవించడం జరిగింది. పెన్షన్ల విషయంలో అలసత్వం వీడి అర్హులైన వారందరికీ వచ్చేలా మరింత వేగంగా అమలు చేయాలని, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చే వారి పట్ల మర్యాదపూర్వకంగా సిబ్బంది వ్యవహరించాలని కోరుతు జంట సర్కిల్లు అయినటువంటి గాజులరామారం కుత్బుల్లాపూర్ సంబంధిత డిప్యూటీ కమిషనర్లు ప్రశాంతి, మంగతాయారు, జనసేన పార్టీ అధ్యక్షులు రాధారం రాజలింగం సూచన మేరకు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రటరీ నందగిరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున వినతిపత్రాలు అందించడం జరిగింది. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించి కాస్త ఆలస్యం అయినప్పటికీ ప్రభుత్వ పధకాలలో భాగమైనటువంటి పెన్షన్లు అర్హులైన అందరికీ అందేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ సకలబత్తుల, వెంకటలక్ష్మి, రమ్య, సంతోషి యాదవ్, సాయికృష్ణ, రమేష్, దుర్గాప్రసాద్, మెర్లదుర్గా, నాగరాజు, కృష్ణతేజ, పవన్, ప్రకాష్, మహేష్, వెంకట్, బాలు, గోపి, భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.