ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

కోనసీమ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి మెట్ల రమణబాబు ముఖ్యఅతిథిగా వచ్చి కేక్ కట్ చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ పట్టణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, ఛాంబర్ అధ్యక్షులు బోణంసత్యవరప్రసాద్, మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కర్రి రామస్వామి (దత్తుడు), నల్లా స్వామి మాకిరెడ్డి పూర్ణిమ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.