రామవరప్పాడులో ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

గన్నవరం నియోజకవర్గం: రామవరప్పాడులో శుక్రవారం జనసేన పార్టీ గ్రామ నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది.. రామవరప్పాడు జనసేన పార్టీ గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు వీరమహిళలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కృష్ణాజిల్లా నాయకులకి, జనసేన పార్టీ గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, జనసైనికులకు, వీరమహిళలకు మరొక్కసారి పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసారు.