మోపిదేవి జనసేన అధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

అవనిగడ్డ, మోపిదేవి మండల కేంద్రమైన మోపిదేవి సెంటర్ లో మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ అధ్యక్షతన గణతంత్ర దినోత్సవ వేడుకలు మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ప్రముఖ న్యాయవాది, ఉమ్మడి కృషాజిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు జాతీయ జెండా వందనం చేసి జాతీయ నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మోపిదేవి పోలీస్ స్టేషన్ ఎస్సై సి.హెచ్ పద్మ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా వచ్చే భక్తులకు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర మత్యఖార కమిటీ నాయకులు లంకె యుగంధర్, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, పార్టీ జిల్లా కార్యదర్శి గాజుల శంకర్ రావు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, పెదకళ్ళేపల్లి ఎంపీటీసీ (1) అరజా ఆశాదేవి, మండలములో పార్టీ తరుపున గెలిచిన వార్డు సభ్యులు యర్రంశెట్టి సునీల్, మత్తి వంశీ, శోభిల రాఘవ, నియోజకవర్గ సీనియర్ నాయకులు బచ్చు వెంకట్ నాథ్, బాదర్ల లోలాక్ష నాయుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు కొక్కిలిగడ్డ ప్రభు కుమారి, భోగిరెడ్డి సాంబశివరావు, మెరకనపల్లి నరేష్ మండల కమిటీ నాయకులు కోసూరు రామారావు, కేతరాజు రామకృష్ణ, కలపాల ప్రసాద్, మండల పార్టీ వీర మహిళ కేతరాజు హిమ నాగ శ్రీవల్లి, మండల నాయకులు చందన సుబ్బారావు, రేపల్లె సీతారామాంజనేయులు, కామిశెట్టి శ్రీనివాసరావు, నియోజకవర్గ పార్టీ ఐటీ విభాగ హెడ్ సూదాని నందగోపాల్ మరియు పెద్ద సంఖ్యలో మండలములో ఉన్న గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.