రాజుపాలెం జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు

గుంటూరు: రాజుపాలెం మండలం జనసేన పార్టీ కార్యాలయం వద్ద 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా వందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రాజుపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య జండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమనికి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి యర్రంశెట్టి రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి గణతంత్ర దినోత్సవం విశేషాల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు, జనసేన నాయకులు గ్రంధి సదాశివరావు, మండల ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్, కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, సంయుక్త కార్యదర్శి చెవుల ఆంజనేయులు, రాజుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు నారపుశెట్టి కోటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు పగడాల నరసింహా రావు, పెమ్మా రమేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.