పిడుగురాళ్ల జనసేన ఆధ్వర్యంలో పూలేకు ఘన నివాళులు

గురజాల: పిడుగురాళ్ల జనసేన పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 192వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్త్రీల యొక్క అభ్యున్నతి విద్య ద్వారా మాత్రమే సాధ్యమని గ్రహించి తన భర్త జ్యోతిరావు పూలే వద్ద విద్యను అభ్యసించి, మొట్టమొదటి మహిళా పాఠశాల ఏర్పాటు చేసి స్త్రీ విద్యను ప్రోత్సహించిన మాతృమూర్తి సావిత్రిబాయి పూలే గారని, ఇప్పుడు ఇంతమంది మహిళలు ఉద్యోగాల్లో కావచ్చు అనేక రంగాల్లో కావచ్చు అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకులు సావిత్రిబాయి పూలే అని ఆమెకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాలని, ఇలాంటి గొప్ప వారి పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టాలని అన్నారు, ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీదూదేకుల ఖాసీం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు సలీం, పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు పెద్దకొలిమి కిరణ్, మండల కార్యదర్శి బేతంచెర్ల ప్రసాద్, రామాయణం రామయ్య, జానపాడు గ్రామ ప్రధాన కార్యదర్శి అంబటి సాయి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.