కావలిలో జనసేన మన ఊరు – మన ఆట

కావలి నియోజకవర్గం: మన ఊరు – మన ఆటలో భాగంగా కావలి నియోజకవర్గం ఇంఛార్జి అళహరి సుధాకర్ అళహరి సుధాకర్ చీఫ్ గెస్ట్ గా వారి ఆర్థిక సహాయముతో తాళ్లురు గ్రామం కావలి నియోజకవర్గంలో 14వ తేదీ ముగ్గులపోటీ నిర్వహించడం జరుగింది. ఈ ముగ్గుల పోటీలలో, ఆడపిల్లలు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతు ఈ నిర్వహిఒచడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు, బహుమతులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా కేవలము మొబైల్ ఫోన్లకు పరిమితమై మన సంప్రదాయాలను కట్టుబాట్లను మరిచి పోతున్న ఈ రోజులలో చిన్నచిన్న ఆడపిల్లలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది అని ఈ సందర్భంగావారి తల్లులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అని పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ విజేతలే అని ప్రతీ ఒక్కరికీ బహుమతులు ఇస్తున్నారు అని తెలిపి ఈ గ్రామ ప్రజలకు, కావలి నియోజకవర్గ జనసేన నాయకులకు, వీరమహిళలకు, జనసైనికులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పెద్ద మాట్లాడుతూ అళహరి సుధాకర్ గారు ముఖ్య అతిథిగా గ్రామానికి విచ్చేసి ఈ కార్యక్రమములో పాల్గొని విజేతలకు బహుమతులు అందించినందుకు అళహరి సుధాకర్ కి గ్రామము తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కృష్ణయ్య, మురళి, వెంకయ్య, టి వెంకటేశ్వర్లు, శ్రీను, ప్రవీణ్ తదితరులకు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణకులు కొండలరావు, సుధాకర్, కలేబు తదితరులు పాల్గొన్నారు.