జనసేనాని జన్మదిన వేడుకలలో పాల్గొన్న గురుదత్ ప్రసాద్

  • గురుదత్ ను పూలమాలతో సత్కరించిన కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు!!

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు & ప్రజానాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ బస్టాండ్ వద్ద జనసేన నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానుల కోరిక మేరకు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ లీడర్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పెద్దఎత్తున్న పాల్గొన్నారు.

• మల్లంపూడి గ్రామంలో జనసేనాని పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న గురుదత్

జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ప్రజానాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, మల్లంపూడి గ్రామ సెంటర్లో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ మరియు గురుదత్ అభిమానులు మరొక కేక్ కట్ చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానుల కోరిక మేరకు ఈ కార్యక్రమల్లో జనసేన పార్టీ సీనియర్ లీడర్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున్న మల్లంపూడి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.