మదనపల్లి జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదినాన సేవా కార్యక్రమాలు

మదనపల్లి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, మదనపల్లి జనసేన నాయకులు హరి హరన్, జనసేనాని టీం అధ్యక్షులు గోపాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, రమణారెడ్డి అధ్యక్షతన శనివారం మదనపల్లెలో పలు సేవా కార్యక్రమాల నిర్వహించడం జరిగింది..‌ పూజా కార్యక్రమం:జనసేన అధ్యక్షులుపవన్ కళ్యాణ్ పేరు మీద స్థానిక వారాల ఆంజనేయ స్వామి గుడిలో ఉదయం 7 గంటలకు పూజలు, అర్చన. అనంతరం భావన నిర్మాణ కార్మికులతో సహబంతి అల్పాహారం: స్థానిక కురవంక భువనేశ్వరి గుడి రామాలయ కల్యాణ మండపంలో ఉదయం 8 గంటలకు భవన నిర్మాణ కార్మికులతో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు కలిసి సహబంతి అల్పాహారం చేయడం జరిగింది తర్వాత రక్తదాన శిబిరం: మదనపల్లి పట్టణంలో మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ లో(సీ టి ఎం రోడ్, టౌన్ బ్యాంక్ సర్కిల్) జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు రక్త దాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలోనా రక్తదానం చేయడం జరిగింది. అనంతరం వృద్దులుకు దుప్పట్లు పంపిణీ: మధ్యాహ్నం 12.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు మదనపల్లి పట్టణం అమ్మ చెరువు మిట్ట నందు వెలుగు వృద్ధాశ్రమం నందు వృద్ధుల వద్ద కటింగ్, వారిచే పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వాదాలు చెపించి అన్నదానం చేయడం జరిగింది. తర్వాత
కేక్ కటింగ్ కార్యక్రమం: మదనపల్లె నియోజకవర్గం, అమ్మ చెరువు మిట్ట, వెలుగు పాఠశాల విద్యార్థులచే కేక్ కటింగ్ కార్యక్రమం. అన్న దానం: మధ్యాహ్నం 1 గం. కు మదనపల్లి పట్టణంలోని వెలుగు స్కూల్ నందు వికలాంగులకు, చిన్న పిల్లలకు అన్నదానం మరియు విద్యార్థులకు అవసరం అయిన వస్తువులు వితరణ చేయడమైనది.
కార్యక్రమాలకు నియోజకవర్గంలోని జనసేన పవర్ ఆఫ్ ది టీం సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, పాల్గొన రాజు, భార్గవి, రాధిక, జనసేన నాయకులు ధరణి హర్ష నరేష్, జాఫర్, అయ్యాజ్, మల్లిక, రూప శోభ లక్ష్మి, అరవింద్, గోవర్ధన్ అనయ్ కుమార్, సుహేల్, శశి, గని, ఫయాజ్, షారుఖ్, వరుణ్, చరణ్ కేతన్, శ్రీకాంత్, ధర్మేందర్, పురుషోత్తం, అశ్వత్, ప్రమాదవ, ఆది, నాగేంద్ర మల్లికార్జున, అశోక్, బీసీ స్టేట్ అధ్యక్షులు వెంకటేష్, తులసి శ్రీనివాసులు లక్ష్మీనారాయణ, పతి, ఆకుల శంకర, వెలగ చలపతి, రమణ, వెంకటేష్, శ్రీనివాసులు ఒక్క జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని ఈ కార్యక్రమాలు విజయవంతం చేశారు.