ఘనంగా రియాన్ పీటర్ జన్మదిన వేడుకలు

కొండెపి నియోజకవర్గం:  పొన్నలూరు మండల జనసేన ఐ.టి విభాగం అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు మొదటి కుమారుడు పిల్లిపోగు రియాన్ పీటర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ముందుగా శ్రీ చైతన్య స్కూల్ నందు, అనంతరం చర్చ్ లో మరియు వారి నివాస గృహంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో ఎం.ఆర్.ఓ చదలవాడ నాగభూషణం మరియు బంధుమిత్రులు పాల్గొని ఆశీర్వాదాలు తెలియజేయడం జరిగింది. పిల్లిపోగు పీటర్ బాబు జనసేన పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తున్నారు, పార్టీకి వెన్నెముకగా ఉంటూ, సేవా కార్యక్రమాలు చేస్తూ, పార్టీకి ఫండ్స్ ఇస్తున్నారు అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, జనసైనికులు పాల్గొని ఆశీర్వాదాలు అందజేశారు.