రక్షాబంధన్ శుభాకాంక్షలు: జయరాం రెడ్డి

అనంతపురం: రక్షాబందన్ ను పురస్కరించుకొని గురువారం జనసేన నాయకులు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డికి అనంతపురం జిల్లా జనసేన వీరమహిళలు రక్షాబంధన్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జయరాం రెడ్డి మాట్లాడుతూ. అక్క, చెల్లెళ్లకు, ఆడపడుచులకు, వీరమహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. సృష్టికి మూలమైన మహిళల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని జనసేన పార్టీ తరపున విన్నవించుకున్నాము.