పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 31వ రోజు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా మూడవ విడతగా తిమ్మాజిపెట మండలంలో 31వ రోజుగా బుధవారం తిమ్మాజిపెట టౌన్ లో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ, మండల, నాయకులు జనసైనికులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ గ్రామంలో పర్యటించారు. రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయింది. ఈ 8 సంవత్సరాలలో ఒక్క టి.అర్.ఎస్. పార్టీ బి.అర్.ఎస్ గా అభివృద్ధి చెందింది అంతే తప్ప

  • దళితుడు ముఖ్యమంత్రి అన్నాడు కనీసం దళిత బంధు లేదు
    • వృద్ధులకు పించెన్ అందట్లేదు
    • ఇంటికొక ఉద్యోగం, రైతు బంధు, రైతు రుణమాఫీ, అంటూ ఎన్నో చెప్పారు, ఆచరణలోకి వస్తె సామాన్యుడి నడ్డి విరుగుతుంది తప్ప సంక్షేమ పథకాలు అందట్లేదు.
    • పాలన మారితే తప్ప సామాన్య ప్రజల జీవితాలు మారువు
    అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లక్ష్మణ్ గౌడ్ కి వారి సమస్యలు మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు వంగ విజయ్ భాస్కర్ గౌడ్, సత్యం, సూర్య, వంశీ రెడ్డి, బొనాసీ లక్ష్మణ్, నవీన్, ఎడ్ల ప్రసాద్, నరసింహ, బోనాసి రాజు, ఏజ్జు ఆంజనేయులు, పూస శివ, ఎడ్ల రాకేష్, ఆంజనేయులు, శివ కుమార్, గువ్వల శివ, మహేష్, కిషన్ నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.