శివభక్తుల పాదయాత్ర.. హర హర శంకరతో మార్మోగిన భైంసా

భైంసా పట్టణంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కాలనీ మహాదేవ్ భక్తులు శివ నామస్మరణలతో కళకళలాడారు. ప్రతి సంవత్సరం లాగానే, ఈ ఏడాది కూడా భక్తులు కావాడి భుజన వేసుకొని భజన–కీర్తనలతో అతి ప్రాచీన మహాశివలింగ దేవాలయానికి పాదయాత్రగా వెళ్లారు. శివలింగానికి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి, భక్తిపూర్వకంగా శివను ఆరాధించారు. అనంతరం సమస్త ప్రజల శ్రేయస్సు కోసం, వర్షాభివృద్ధి కోసం, ఆయురారోగ్య సంపదల కోసం శ్రద్ధతో ప్రార్థనలు చేశారు. హర హర మహాదేవ్ నినాదాలతో భైంసా ఆధ్యాత్మికతతో నిండిపోయింది.

Share this content:

Post Comment