48 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు

హైదరాబాద్‌: ఒడిశా నుంచి విదర్భ వరకు ఏర్పడిన ఆవర్తనం, 18 డిగ్రీల అక్షాంశంపై ఏర్పడ్డ షియర్‌జోన్‌ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అయితే శుక్రవారం సాయంత్రం వరకు వీటిలో మార్పులు ఏర్పడే అవకాశాలున్నాయని, ఆవర్తనం, షియర్‌జోన్‌లు స్థిరంగా కొనసాగితే భారీ వర్షాలు కురవచ్చని అధికారులు తెలిపారు. వానల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోయాయి.