వాత్సల్య స్కీంను ప్రజలకు వివరించిన ఎంపిటిసి అమర్ కార్తికేయ

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజకవర్గం, వాత్సల్య స్కీం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినది. దీని ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నెలకు 4000 వేల రూపాయలు ఇవ్వడం. పిల్లల వయసు 18 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ విషయాన్ని తనకల్లు మండలం బాలసముద్రం గ్రామం, మారప్పగారి పల్లి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రజలకు లబ్ధిచేకూరే విషయాలను తెలియజేయడం ఎంపిటిసిగా నా బాధ్యత అని బాలసముద్రం గ్రామ జనసేనపార్టీ ఎంపిటిసి అమర్ కార్తికేయ తెలిపారు.