ఎంతమంది కాపు విద్యార్థులను విదేశీ విద్యకు పంపించారు

నీతి – నిజాయితీ, సిగ్గు – ఎగ్గు ఇసుమంతైనా లేకుండా వైసిపి లోని కాపు పెద్దలు (జగన్ రెడ్డి పాలేరులు) కేవలం తమ స్వార్థం కోసం, మంత్రి పదవులు పోతాయని, రేపు మళ్ళీ ఎమ్మెల్యే టిక్కెట్ రాదేమోనని కులాన్ని సంక నాకిచ్చే పని పెట్టారు. నిజానికి ఒకింత ఆశ్చర్యం గానూ, అంతకంటే ఎక్కువ బాధ గానూ ఉంది, ప్రస్తుత పరిస్థితి వల్ల. వైకాపా పార్టీ పెద్దలు ఆంగ్లేయుల తరహాలో విభజించి పాలించు విధంగా కాపులను వైకాపా కాపులు, ఇతర కాపులుగా తయారు చేయడాన్ని గుడ్లూరు మండల జనసేన మరియు కాపు సంక్షేమ సేన సంయుక్తంగా బాధాతప్త హృదయంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. కాపులను కాపుల తోనే తిట్టించడం ఈ దౌర్భాగ్యం మరే ఇతర కులానికి రాకూడదని మా ఆవేదన. విషయానికీ వస్తే గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో కాపులకు మేలు చేయలేదు. ఔనవును జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాపు కార్పోరేషన్ కు 2000 కోట్లు కేటాయిస్తామని, తీరా అధికారంలోకి వచ్చాకా ఎన్ని కోట్లు కేటాయించారో వైకాపా పాలేరులే చెప్పాలి. ఎంతమంది కాపు విద్యార్థులను విదేశీ విద్యకు పంపించారు, ఎంతమంది కాపు యువతకు కార్పోరేషన్ ఋణాలు కల్పించారు. ఎంతమంది కాపు నిరుద్యోగులను ఉపాధి వైపు మల్లించారు. అదేమంటే సుమారు 70 లక్షల పైచిలుకు కాపులకు 27 వేల కోట్లు ఈ మూడున్నర ఏళ్లలో కల్పించామని ఢంకా భజాయిస్తున్న కాపు పాలేరులు గమనించుకోవాల్సినది ఏమంటే కాపులు నీతి – నిజాయితీకి, మొండి దైర్యానికి, పట్టుదలకు, ఇచ్చిన మాటకు కట్టుబడి కాపు కాసే వారే గానీ, తెలివి తక్కువ వారు కాదు. ప్రభుత్వ పధకాలనేవి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ఆ విషయం కూడా తెలియనంత అమాయకంగా కాపులు లేరు. ఇప్పుడు అనగలరా గతంలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో కాపులకు మేలు చేయలేదని గుడ్లూరు జనసేన నాయకులు చలపతి అన్నారు.