పవన్ కళ్యాణ్ ని విమర్శించే అర్హత కాపు మంత్రులకు లేదు: బొలిశెట్టి వంశీకృష్ణ

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు రాజమండ్రిలో సభ ద్వారా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తే ఇస్తానన్న పదివేల గురించో, ఇతర దేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు వాళ్లు పడుతున్న అవస్థల గురించో, ఫీజు రీయింబర్స్మెంట్ మీద జాయిన్ అయినా కాపు విద్యార్థులు పూర్తిచేసిన ఫీజు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వని దాని గురించో, కాపు సంక్షేమ నిధుల వినియోగంపై కాపు యువతకి సమాధానం చెప్పాల్సిన కాపు మంత్రులు నైతిక విలువలు మరిచిపోయి పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో మీడియా సమావేశంలో బొలిశెట్టి వంశీకృష్ణ అన్నారు. ఎంతసేపు పవన్ ని విమర్శించటం పవన్ వ్యక్తిగత విషయాలు మీద మాట్లాడటం ద్వారా సీఎం జగన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడమే తప్ప కాపు సంక్షేమ నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏనాడైనా వైఎస్ఆర్సిపి కాపు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నోరు మెదిపారా? జగన్ మెప్పుకోసం భజన చేస్తూ కాలక్షేపం చేస్తూ కాపులను మోసం చేస్తున్న మాట వాస్తవం కాదా, నామినేటెడ్ పోస్టుల్లో ఉద్యోగస్తుల ప్రమోషన్స్ లో కాపులకు జరుగుతున్న అన్యాయం గురించి ఏనాడైనా సీఎం జగన్ ని నిలదీశారా ఇతర దేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులకు కాపు మంత్రులు ఎలాంటి సపోర్ట్ చేశారు వారికి ఎలాంటి మనోధైర్యాన్ని ఇవ్వగలిగారు. వీటి మీద మాట్లాడాల్సింది మీరు పదేపదే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తే సహించేది లేదని ముల్లును ముల్లుతోనే తీస్తాం మిమ్మల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాకమర్రి నాగేష్, రుద్ర గని, విన్నుకోట సాయికృష్ణ, అజాష్ షేక్, పండు తదితరులు పాల్గొన్నారు.