హుస్నాబాద్ జనసేన ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని స్థానిక పట్టణంలో పార్టీ మండల నాయకులు మల్లెల సంతోష్ ఆధ్వర్యంలో మంగళవారం జనసేన జెండా ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లెల సంతోష్, గుండా సాయి చంద్, మోరె శ్రీకాంత్, మ్యాకల రాజు, కొలుగూరి అనిల్, హిమవంత్ తదితరులు పాల్గొన్నారు.