ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా ఇచ్చిన హ్యుందాయ్

కొవిడ్-19తో పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్(హెచ్ఎంఐఎఫ్) 100 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను విరాళంగా అందించింది. అలాగే 50 బిపాప్ యంత్రాలను కూడా ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌లకు అందజేసింది. వీటిని రాష్ట్రంలోని పలు ఆస్పత్రులకు పంపిణీ చేయనున్నారు. అదనంగా, సమాజానికి పెద్ద ఎత్తున మద్దతునందిస్తూ, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూరులో హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా ఫౌండేషన్‌ ఓ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొంది.