చిన్నారి ఆధ్య వైద్యానికి ఇచ్ఛాపురం జనసేన ఆర్ధిక సహాయం

ఇచ్చాపురం నియోజకవర్గం: కవిటి మండలం, ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్న యాండ్రాపు చిరంజీవి ముద్దుల పాప తొమ్మిది నెలల చిన్నారి ఆధ్య హెచ్ఎల్ హెచ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని స్థానిక జనసైనికులు మరియు ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకొని ఇచ్ఛాపురం జనసేన పార్టీ తరుపున తక్షణ సహాయంగా రూ.20,000 ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపిల్లి ఈశ్వర్ రావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూగాన దివాకర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, తలగాన ఈశ్వర్, నర్తు రామమూర్తి, బడగల రామకృష్ణ, రాజశేఖర్, లోళ్ళ ధనుంజయం, అజయ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ మానవత్వంతో ప్రతీ ఒక్కరూ పాపకు ముందుకు వచ్చి సహాయం చేయాలని, పాప సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని కోరడం జరిగింది.