పత్తికొండలో నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ ఎత్తు, వెడల్పు పెంచాలి: జనసేన డిమాండ్

పత్తికొండ నియోజకవర్గం: పత్తికొండలో పాత ఊరి వాకిలి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ ఎత్తు, వెడల్పు పెంచాలని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండలో అభివృద్ధి పేరుతో అంబేద్కర్ సర్కిల్ నుండి పాత ఊరు వాకిలి వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కాలువలు నియమించాలని చెప్పి జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధికారులపై ఒత్తిడి చేసాం, మాతోపాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఈ సమస్యపై పోరాటం చేశారు. అందరి ప్రయత్నం వల్లే ఈ కాలువ నిర్మాణం చేపట్టారు. కానీ ఎత్తు 4 అడుగులు, వెడల్పు 2 అడుగులతో నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయంపై ఆర్.అండ్.బి ఏఈ మేడంతో మాట్లాడడం కూడా జరిగింది. మేడం గారు ఇంత చిన్న డ్రైనేజీ కాలవలు నిర్మించడం వల్ల చిన్నపాటి వర్షానికి రోడ్లపైకి నీరు వస్తుంది కావున డ్రైనేజీ కాలువలు వెడల్పు పెంచాలని అడగడం జరిగింది. ఏఈ గారు సమాధానం మాకు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారమే మేము కాలవను నియమిస్తున్నాం అన్నారు. అలా నిర్మిస్తే చిన్నపాటి వర్షానికి రోడ్లు పైకి నీరు ప్రవహిస్తుంది మేడం గారు ఎలాగైనా కాలవను వెడల్పు చేయాలని తెలియజేశాం. అలా కుదరదు మాకు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారమే మేము కాలవను నియమిస్తున్నాం ఎందుకంటే పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీకి డిఫరెంట్ గా ఉంటాయి మన పత్తికొండ గ్రామపంచాయతీ కావున మేము ఏమి చేయలేం అంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఈ విషయంలో మేము వ్యతిరేకిస్తున్న విషయం ఏమిటంటే పత్తికొండలో దాదాపు 40000 జనాభా నివసిస్తున్నారు, ఈ జనాభాకు ఇలా చిన్నపాటి డ్రైనేజీ కాలువలు సరిపోవు, పత్తికొండలో నివసిస్తున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని డ్రైనేజీ కాలవలు వెడల్పు ఎత్తు పెంచాలని మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు నియమిస్తున్న కాలువలు ఏమాత్రం సరిపోవు, అందరికీ జనసేన తరఫున తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.