నెల రోజుల్లో రోడ్డు వేయకపోతే ఆమరణ దీక్ష చేస్తా: యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం పంచాయతీ, గాజుల కండ్రిగ గ్రామంలో జనంకోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నియోజకవర్గం జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న మాట్లాడుతూ గాజుల కండ్రిగ గ్రామాన్ని పాలకవర్గం విస్మరించినారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు, పాలకులు రోడ్డు వేస్తామని ఎన్నో హామీలిచ్చారు కానీ నెరవేర్చలేక పోయారని తెలిపారు. ఓట్లు కోసం వచ్చిన వాళ్లంతా ఉత్తుత్తి హామీ లిచ్చారని, చివరికి మరిచారని ఏద్దేవా చేసారు.గత ముప్పై సంవత్సరాలుగా మంచి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజల సమస్యను చిత్తూరు జిల్లా కలెక్టర్ స్పందించి, సకాలంలో రోడ్డు మంజూరు చేయాలనీ విజ్ఞప్తి చేసారు. నెల రోజుల్లో రోడ్డు వేయక పోతే గ్రామం కోసం ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. గ్రామీణ రహదారుల ఏర్పాటు జనసేనకే సాధ్యమని, ఒక్క అవకాశం జనసేనకు ఇవ్వండని గ్రామ ప్రజలను కోరారు. ఏపీలో పవన్ కళ్యాణ్ స్వర్ణ యుగం తీసుకొస్తారని, పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలను తెలియజేసారు. కార్యకర్తల కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. దీనిని జనసైనికులు, వీర మహిళలు, సాధారణ ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ, మండల ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కార్యకర్తల కోసం ప్రమాద వసాత్తు మరణించిన 92 మంది కార్యకర్తల కుటుంబాలకు నాలుగు కోట్ల యనబై లక్షలు ఇచ్చారని తెలిపారు. గాయపడిన 169 మంది జనసైనికులకు 60 లక్షల 90వేల 781 రూపాయలు ఇచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు విజయ్, నాయకులు దేవ, కిరణ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.