మహిళా సాధికారితే జనసేన లక్ష్యం: గురాన అయ్యలు

విజయనగరం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మహిళలు స్వావలంబన సాధించేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని విజయనగరం జనసేన నాయకులు గురాన అయ్యలు అన్నారు. స్థానిక జీఎస్ఆర్ హోటల్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది స్వర్ణ, వైద్యరాలు కాంచన, ఉపాధ్యాయురాలు పెనుమత్స జయ తదితరులను సత్కరించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ మహిళల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా, మహిళా సాధికారతకు పట్టం కట్టేలా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. మహిళ అంటే చిన్న చూపు తగదని, సమాజ నిర్మాణంలో మహిళలదే కీలకపాత్ర అన్నారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకల భావం(థీం) జెండర్ సమానత్వమని, ఈ ఉద్దేశ్యాన్ని అందరూ పాటించాలని, ప్రతి ఇంటిలో మహిళను పురుషులతో సమానంగా చూడాలని అన్నారు. ఆడ, మగ పిల్లల్ని తేడాలు లేకుండా పెంచాలన్నారు. సమాన అవకాశాలను, విద్యనూ, నైపుణ్యాన్ని ఆడ పిల్లలకు ఇచ్చినప్పుడే ఈ థీం ను సాధించగలమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణ (బాలు), ఎం.టి రాజేష్, ఎమ్.పవన్ కుమార్, కోలగట్ల తేజ, కంది సురేష్, బి.సంతోషి తదితరులు పాల్గొన్నారు.