బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం

‘అల్లుడుశీను’తో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ ‘ఛత్రపతి’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఛత్రపతి హిందీ రీమేక్ కొన్ని వారాల క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. ‘ఛత్రపతి’ చిత్రంతో బీటౌన్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమైన శ్రీనివాస్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

 నేను ఇప్పటివరకూ నటించిన ఏడింట ఆరు సినిమాలు (హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌) యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించాయి. సినిమాల వల్ల ముంబయి, దిల్లీ ప్రాంతాల్లో ప్రజలు నన్ను గుర్తుపడుతున్నారు. అది నాకెంతో సంతోషంగా అనిపించింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. ఇంతకుముందు తనకు నేరుగా హిందీ సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని.. కానీ స్క్రిప్ట్స్ ఏవీ సంతృప్తికరంగా లేవని సాయి చెప్పారు. ఛత్రపతి’ కథ నాకు సరిపోతుందని అనుకుంటున్నా. ఒరిజినల్‌ వెర్షన్‌లో ప్రభాస్‌ పోషించిన పాత్రను రీక్రియేట్‌ చేయడానికి భయపడడం లేదు. అలాగే బాలీవుడ్‌కు చెందిన ఎక్కువమంది ప్రేక్షకులు ఒరిజినల్‌ చిత్రాన్ని వీక్షించలేదు’.

ప్రభాస్ పోషించిన ఐకానిక్ పాత్రను పోషించాలన్న సాహసంపైన మాట్లాడుతూ.. రెబల్ స్టార్ ప్రభాస్ పాత్రలో తాను నటించడం అస్సలు నెర్వస్ ఫీలవ్వడం లేదని అన్నారు. హిందీ వెర్షన్ స్క్రిప్ట్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా స్ర్కిప్ట్‌లో మార్పులు చేశాం అని ఆయన వెల్లడించారు.  కెరీర్‌పరంగా నేను తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా అని బెల్లంకొండ శ్రీనివాస్‌ వివరించారు.