ఫలించని చర్చలు.. ఆందోళనలు ఉధృతం చేసే దిశగా రైతు సంఘాలు..!

వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన కొనసాగుతూనే ఉంది. రైతు నేతలపై డిమాండ్లపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో రైతు నేతలు కూడా తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.  నిన్నఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో వెంట ఆందోళనకు దిగగా.. తమ కార్యాచరణకు ప్రకటించారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు రాజస్తాన్‌లోని షాజహన్ పూర్ వద్ద ట్రాక్టర్ ర్యాలీ తీస్తామని రైతు నేత కమల్ ప్రీత్ సింగ్ పన్ను తెలిపారు. ఇదీ ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్బందిస్తుందని తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయాల్సిందేనని.. రైతు నేతలు పట్టుబడుతున్నారు.

సోమవారం రోజున జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగుతామని చెప్పారు. తమతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమయితే తాము కూడా రెడీ అని పేర్కొన్నారు. తమ ప్రధాన డిమాండ్ మాత్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు సవరణలు చేయడమేనని తెలిపారు. తమ నిరసనలకు కూలీలు, మహిళలు మద్దతు తెలుపాలని కూడా కోరారు.