నగరి నియోజకవర్గ ఎన్నారై టీం రూపొందించిన జనసేన క్యాలండర్ల ఆవిష్కరణ

నగరి నియోజకవర్గ ఎన్నారై టీం ఆధ్వర్యంలో రూపొందించిన జనసేన క్యాలండర్ల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర పీఏసీ మెంబర్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆవిష్కరించి నగరి జనసేన నాయకులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగిరి నియోజవర్గంలోని ఐదు మండల నాయకులు మరియు నియోజకవర్గ కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.