ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవం చేసిన నెల్లూరు జనసేన

నెల్లూరు నగరంలో యన్.టీ.అర్ నగర్ నందు అప్పల సుశీలమ్మ ఫౌండేషన్ వారి సహకారంతో జనసేన నగర కార్యదర్శి మరియు 11వ డివిజన్ అధ్యక్షులు దాసరి రమణ & మాధురి దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించిన ముగ్గుల పోటీల బహుమతి ప్రదానోత్సవంలో నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు సరయు షోరూమ్ అధినేత అప్పల రాజ్ కుమార్, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు కందికట్ల రాజేశ్వరి, మరియు ప్రముఖ న్యాయవాది రమాదేవి పాల్గొని వారి చేతుల మీదగా గెలిచినా వారికీ బహుమతులు అందచేయటం జరిగింది.