ఏపీలో పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో ఏపీ ప్రభుత్వం 48 వేల 746 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..8 వేల 12 మందికి పాజిటివ్ గా తేలింది. దీనితో కరోనా కేసుల సంఖ్య. 2 లక్షల 89 వేల 829కు చేరుకుంది. గత 24 గంటల్లో 10 వేల 117 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 2 లక్షల 1 వేయి 234కు చేరుకుంది. తాజాగా 88 మంది కరోనా కారణంగా మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2 వేల 650కు చేరుకుంది. ప్రతి రోజూ సరాసరిన 50 వేల పరీక్షలు చేస్తూ ఏపీ ప్రభుత్వం రికార్డు సాధిస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 28 లక్షల 60 వేల 943 పరీక్షలు జరిగాయి.