జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు జనసేన సోషల్ మీడియా ఉద్యమం

అనంతపురం: ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే సోషల్ మీడియా ఉద్యమం ద్వారా #JaganannaMosam కార్యక్రమం రెండవ రోజు బుక్కరాయసముద్రం మండలంలోని దండువారి పల్లి గ్రామంలో పేదలకు కేటాయించిన ఇల్లు స్థలాలు పరిశీలించడం జరిగింది. అసలు అవి గ్రామానికి దూరంగా కొండలలో ఉన్నాయి.. ఇంత వరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు..ఊరికి దూరంగా ఉండటం వలన ప్రజలు కూడా నిర్మించుకోలేదు.. అదీకాక ఇక్కడ ఎస్సీలకు ఒక చోట ఇతరులకు ఒకచోట కేటాయించిన ఈ పాలకుల చిత్తశుద్ధి ఏ పాటిదో వీరింకా ఏ కాలంలో ఉన్నరో ప్రజలు గ్రహించాలి.. ఈ స్థలాలు అన్ని పిచ్చి మొక్కలు, ముల్ల పోదలతో నిండిపోయింది. ట్రాన్సిఫిరెన్స అని చెప్పుకొనే పాలకలకు అసలు దీని అర్థం ప్రజలను పీడించటం, మోసం చేయడం అని అతని పాఠశాలలో తెలిపారేమో మన క్లాస్ నెం.వన్ స్టూడెంట్ కి.. మీరిచ్చిన ఇల్లు పై మీ ట్రాన్సిఫిరెన్స ఏపాటిదో తెలపాలని ప్రజల తరుపున జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది..అధికార పార్టీ ఎమ్మెల్యే చేయవలసినది గడప గడప కార్యక్రమం కాదు జగనన్న కాలనీల్లో పరిస్థితి చూడండి ముల్ల కంపలే మీ పాలన ఏపాటిదో తెలుపుతాయి. ఈ మంత్రులకు పదవులు నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ గారని తిట్టడానికి.. అనవసర కేసులు పెట్టి ప్రజల ను బెదించటానికి కాదుఅని మీకు ఏమాత్రం 1% చిత్తశుద్ధి ఉన్న పేదలకు కేటాయించిన ఇల్లు ఎన్ని నిర్మించింది ఎన్ని మిగతావి ఉన్నాయా లేవా ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి అని ఒక స్వేతపత్రం విడుదల చేయాలని ప్రజల తరుపున ఈ ప్రభుత్వం ను జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర శేఖర్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి జయమ్మ, మండల కన్వీనర్ ఎర్రిస్వామి, మన్నల పెద్దిరాజు, ఉపాద్యక్షులు సిరిసాల సుమన్, ప్రధాన కార్యదర్శి తాహీర్, మండల నాయకులు వంశీ, అవ్వారి రమేష్, మను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.