పెందుర్తి జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

పెందుర్తి నియోజకవర్గం, విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు ఆడిట్ లో భాగంగా పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి మండలం, నరవ, జేరిపోతుల పాలెం, ఎప్పిలివానిపాలెం గ్రామాలలో జగనన్న ఇండ్ల లేఔట్లను జనసేన పార్టీ నాయకులు పరిశీలించడం జరిగింది. స్థానిక నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ ఆదివారం జగనన్న ఇండ్ల లేఔట్ లో పరిశీలించడంలో భాగంగా ఒకంత ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారని, నివాసానికి యోగ్యమైన స్థలాలలోకాకుండా జగనన్న ఇల్లును పేద ప్రజలకు బలవంతంగా ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, నరవ గ్రామంలో 100 ఎకరాల భూమిని స్థానిక ప్రజల నుంచి ల్యాండ్ పుల్లింగ్ చేసి అక్కడ ఉన్న పంటను తొలగించి నివాసానికి కావలసిన యటువంటి మౌలికలవసతలు ఏర్పాటు చేయకుండా, నాశరకమైన కట్టడాలు చేపట్టి, లేఔటు చదును చేయకుండా ఇక్కడ ఉన్న గ్రావెల్ అక్రమంగా అమ్ముకొని, స్థానిక నరవ గ్రామ ప్రజలకు కేవలం 65 ఫ్లాట్లు మాత్రమే కేటాయించడం ఈ యొక్క లేఔట్ లో జరుగుతున్న స్కాముకు నిదర్శనమని, జెర్రిరుపుతుల పాలెం, ఉప్పులవానిపాలెం గ్రామాల్లో లేఔట్లు పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఎటువంటి మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజీ విద్యుత్తు ఏర్పాటు చేయకుండా, నివాసానికి ఎటువంటి అవకాశం లేని క్వారీ ప్రదేశంలో ప్రజలను బలవంతంగా ఇల్లు నిర్మించాలని ఒత్తిడి తీసుకొని రావడం, లేఔట్ లో పేద ప్రజలకు ఇండ్ల ప్రదేశాలును కేటాయించకుండా స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కుటుంబీకులకు, బినామీ వ్యక్తుల పేర్లతో ఇండ్లను కేటాయించి స్కాములు చేస్తున్నారని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేత పత్రం రిలీజ్ చేయాలని జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నామని మాట్లాడడం జరిగింది, స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు ఈ ఇండ్ల స్థలాన్ని పరిశీలిస్తే ప్రజలకు మౌలిక వసతలు ఏర్పాటు చేయకుండా, భయంకరమైన క్వారీ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో కొండ చర్యలు విరిగి ఇండ్లపై పడితే పేద ప్రజలు మరణిస్తే ఎవరు బాధ్యులని, స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు బినామీ పేర్లతో ఫ్లాట్లు కేటాయించుకొని స్కాములు చేశారని, వీటన్నిటిని స్థానిక కలెక్టర్ తెలియజేసి భవిష్యత్తులో జనసేన పార్టీ తరఫున ఆడిట్ జరిపి అక్రమ దారులకు శిక్ష పడేలాగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది, స్థానిక జేరిపోతులపాలెం నాయకులు సాలపు అప్పరావు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమ క్వారిలు జరిపి వందల ఎకరాలు పనికిరాకుండా చేశారని, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కూడా జీడి తోటలను పండ్ల తోటలను తొలగించి ఎటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా జగనన్న ఇండ్లు నిర్మించడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, స్థానిక పేద ప్రజలకు ఇండ్ల స్థలాలను కేటాయించకుండా బయట వ్యక్తులకు బినామీ పేర్లతో ఇండ్ల స్థలాలను కేటాయించడం జనసేన పార్టీ ద్వారా వ్యతిరేకిస్తున్నామని భవిష్యత్తులో జనసేన పార్టీ తగు చర్యలు తీసుకుంటుందని మాట్లాడం జరిగింది, ఈ కార్యక్రమంలో గవర గోపి, గోపిశెట్టి ప్రవీణ్, బొడపల్లి గోపి, లోకేష్, నవీన్, ప్రసాద్, శ్రీను మరియు జన సైనికులు పాల్గొన్నారు.