వృద్ధులకు, వికలాంగులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన జనసేన నాయకులు

గుంటూరు, అధికారం కోసం ఎలాంటి అరాచకాలకైనా పాల్పడే వైసీపీ నేతల చూపు ఇప్పుడు వృద్ధులు, వికలాంగులపై పడిందని, పింఛన్ల పంపిణీపై వైసీపీ కుట్ర రాజకీయాలకు తెరతీసి పేదల జీవితాలతో చెలగాటమాడుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కన్నీళ్లలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవటం ఖాయమని ఆయన అన్నారు. పింఛన్ కోసం సచివాలయాలకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులకు జనసేనాని పిలుపుమేరకు గురువారం ఆయన మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ అసలే వేసవికాలం కాలం కావటంతో ఎండలు మండుతున్నాయని ఈ నేపధ్యంలో వైసీపీ నేతలకు కనికరం కూడా లేకుండా దుష్ట రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వృద్ధుల ఉసురు ఊరికే పొదన్నారు. ఖజానాలో ఉన్న డబ్బు మొత్తాన్ని తన అనునూయులకు, బినామీలకు కట్టబెట్టిన జగన్ రెడ్డి సామాజిక పింఛన్ల పంపిణీకి మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో డబ్బు పంపిణీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. తన చేతకానితనాన్ని విపక్షాలపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయటం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అయితే శవ రాజకీయాలకు కాలం చెల్లిందన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. ఉమ్మడి ప్రభుత్వంలో ఏర్పడ్డాక సంపద సృష్టితో మరిన్ని సంక్షేమ పథకాలు అమలచేసేందుకు కృషి జరుగుతుందని ఆళ్ళ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, నండూరి స్వామి, మహేష్, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.