అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని , సెక్షన్ 30ని అడ్డుపెట్టి వారాహిని ఆపటం అసాధ్యం

  • పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు

అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని, సెక్షన్ 30ని అడ్డుపెట్టి వారాహిని ఆపటం అసాధ్యమని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు పేర్కొన్నారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనాలు సృష్టించింది. వైసిపి నాయకుల్లో, శ్రేణుల్లో తీవ్ర అలజడిని రేకెత్తించింది. అందుకే సెక్షన్ 30ని ప్రయోగించింది. జీవో నెంబర్ వన్ విషయంలో కోర్టులో మొట్టికాయలు తిన్నా వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు రాలేదు. చీకటి పరిపాలన, చీకటి జీవోలు వైసిపి ప్రభుత్వానికి షరా మామూలే. గతంలో విశాఖపట్నంలో, ఇప్పటంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలని ప్రయత్నించి పూర్తిగా విఫలమైనా వైసిపి ప్రభుత్వానికి ఇంకా సిగ్గు రాలేదు. మీరు ఎన్ని సెక్షన్లు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించిన జూన్ 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభం కావడం తథ్యం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల వద్దకు ఒక నాయకుడు వస్తుంటే అడ్డుకోవాలి అనుకోవడం మీ మూర్ఖత్వమే అవుతుంది. వారాహి యాత్ర డేట్ ను ప్రకటించిన వెంటనే వైసీపీ నాయకుల గుండెల్లో వారాహి పరిగెడుతుంది. మొన్నటి వరకూ వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు వారాహి యాత్ర ఎప్పుడు ఎప్పుడు అని పిచ్చి ప్రేలాపనలు పేలి ఇప్పుడు యాత్ర అనగానే భయంతో సెక్షన్ 30 ప్రయోగించి యాత్రను అడ్డుకోవాలనుకోవడం మీ అవివేకం అవుతుంది. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికారపక్షం అడ్డుకొని ఉంటే పాదయాత్ర చేసే వాడివా?.. పోలీస్ వ్యవస్థను, అసాంఘిక శక్తులను అడ్డుపెట్టుకొని వారాహిని ఆపాలనుకుంటే వైసిపి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వారాహి యాత్ర వైసీపీ ప్రభుత్వానికి అంతిమ యాత్ర కానుంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను పవన్ కళ్యాణ్ గారు ఎండకడతారని, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రస్తావిస్తారనే భయంతో కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ గారి యాత్రని అడ్డుకోవాలని ప్రయత్నం వైసిపి ప్రభుత్వం చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే రాజకీయాలు చేస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని అడ్డుకోవాలని చూస్తే ప్రజా ఆగ్రహానికి వైసిపి ప్రభుత్వం గురికావాల్సి వస్తుంది. వారాహి యాత్రతో జనసేన భవిష్యత్తు ఉజ్వలం, వైసీపీ భవిష్యత్తు అంధకారం కావడం ఖాయం అని ఎస్ వి బాబు హెచ్చరించారు.