శ్రీకాళహస్తిలో కలకలం రేపడం మా సిద్ధాంతంకాదు

  • శాంతి యుతంగా రాజ్యాంగబద్ధంగానే జనసేనాని వినతి సమర్పణ
  • జనసేన పార్టీ వెల్లడి

తిరుపతి, శ్రీకాళహస్తిలో పోలీస్ అధికారిణి మా జనసేన నాయకులు కొట్టేసాయి పై దురుసుగా ప్రవర్తించి, చేయి చేసుకున్న ఘటనన దేశవ్యాప్తంగా మీడియా ద్వారా తెలిసినదే. దీనిపై జనసైనికులకు ధైర్యం ఇవ్వడానికి మరోసారి జనసైనికుడిపై దెబ్బ పడితే రాజ్యాంగపరంగా చర్యలు తీసుకుంటామనే భరోసా కల్పించేందుకే , తమ జనసేనాని పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి నేరుగా తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అర్బన్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి వినతి పత్రం సమర్పిస్తారని, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, కీర్తన, బాబ్జి, కృష్ణయ్య, రాఘవయ్యలతోపాటు కాళహస్తి ఇన్చార్జులు వినుత కోటా, కొట్టే సాయి, చంద్రబాబులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ జనసైనికులు వేలమంది ముందు తమ జనసేనాని రథసారథి అన్నాను. కానీ కోట్ల మంది వైకాపా నుండి విముక్తి కోసం, పవన్ కళ్యాణ్ కాపాడుతాడని ఎదురు చూస్తున్నారన్నారు. అందరి సభలకు జనాలను డబ్బులు ఇచ్చి తోలాలన్నారు. కానీ తమ జనసేనాని సభలకు జనాన్ని ఆపాలన్నా సాధ్యపడదన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బినామీగా అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతి, విజయవాడ, హైదరాబాదు తదితర నగరాలలో అక్రమ ఆస్తులను ఆర్జించి, వైకాపాకు కొమ్ము కాస్తున్నదని ఆరోపించారు. ఈ అక్రమ వ్యవహారాలపై ఎస్పీకి వినతిపత్రం సమర్పించేందుకు చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించి తమ పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నారని అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆయనకి పెద్దయెత్తున ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.