ఇవాంకా బెస్ట్

అమెరికా అధ్యక్షురాలిగా తన కూతురు ఇవాంక ట్రంప్‌ మాత్రమే బెస్ట్‌ అని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. న్యూహాంప్‌షైర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వ్యాక్యలు చేసారు. డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్‌ అర్హురాలు కాదన్నారు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత ట్రంప్‌ న్యూ హాంప్‌షైర్‌లో తొలి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ”అమెరికా అధ్యక్ష పదవిలో భవిష్యత్తులో ఓ మహిళను చూడాలని ఉంది. అయితే, కమలా హారిస్‌ వంటి వ్యక్తి మాత్రం కాదు” అన్నారు. వెంటనే కొందరు ఇవాంక ట్రంప్‌ అంటూ కేకలు వేశారు. దీంతో ”వారంతా ఇవాంక రావాలంటున్నారు. ఇవాంకకు అధ్యక్షురాలిగా పని చేసే సత్తా ఉంది” అన్నారు.