జగనన్న కాలనీనా మజాకాన..!

  • నిరుపయోగంగా ఉన్న స్థలం ఎవరికి కేటాయిస్తున్నారో
  • మౌలిక వసతులు ఎక్కడ
  • జగనన్న కాలనీ చుట్టూ వర్షపు నీరు
  • జగనన్న కాలనీ వచ్చే రాజు మార్గాన వర్షపు నీటితో అల్లాడుతున్న కాలనీవాసులు
  • మాధవరం జగనన్న కాలనీ వాసులకు ఎన్ని కష్టాల్లో!
  • చలించిపోయిన రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు అతికారి దినేష్

వైఎస్సార్ కడప జిల్లా, రాజంపేట, సిద్ధవటం మండలం మాధవరం మేజర్ గ్రామపంచాయతీలో జగనన్న కాలనీలో వర్షపు నీరు కాలనీ చుట్టు, ఉన్నాయని కాలనీకి వెళ్లే రహదారి ఒక చెరువుకుంటలా ఉందని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ యువ నాయకులు అతికారి దినేష్ మండిపడ్డారు, కాలనీలోకి వెళ్లాలంటే దుర్వాసన వస్తుందని ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని, జగనన్న కాలనీలో రోడ్లు లేవని, విద్యుత్ సరఫరా కూడా నామమాత్రంగా ఉందని, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుండ్లు చుట్టుపక్కల గుంతల్లో మరియు రహదారిలో నీరు నిలువున్నాయని కొన్ని గృహాలు కూడా కట్టుకోలేని పరిస్థితి అని జనసేన పార్టీ నాయకులు అతి కారి దినేష్ అన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు #Fఐలురెఓఫ్ఝగనన్నఛొలొన్య్ అనే హాష్ ట్యాగ్ తో డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీలో వారి సమస్యలపై కాలనీ వాసులకు అడిగి తెలుసుకున్నారు సక్రమంగా బిల్లులు పడలేని పరిస్థితిని, రోడ్లు సరిగా లేవని జగనన్న కాలనీవాసులు సమస్యలు తీసుకొచ్చారు రాజంపేట నియోజకవర్గ యువ నాయకులు దినేష్ మాట్లాడుతూ రోడ్లు కూడా సరిగా లేని పరిస్థితి అని, జగనన్న కాలనీకి వచ్చే రైల్వే తూము కింద నీరు నిల్వ ఒక చెరువుకుంటలా ఉందని శాశ్వత పరిష్కారం చేయాలని ఒకసారి వీరి సమస్యలు రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి వైసిపి ఎమ్మెల్యేగా నాలుగు సంవత్సరాలు అయినా రాజంపేట నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని నియోజకవర్గంలో జగనన్న కాలనీలు పర్యటిస్తే జగనన్న కాలనీ వాసుల సమస్యలు తెలుస్తుందని అని మట్టి మాఫియా ఇసుక మాఫియా భూకబ్జాలు అధికార పార్టీ వాళ్లు ఎమ్మెల్యే వెంకట మల్లికార్జున్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోతున్నారని ఈ వియషంలో మీకు చిత్తశుద్ది లేదా అని జనసేన పార్టీ నాయకులు దినేష్ అన్నారు. ఆటోలు కార్లు కూడా వచ్చే పరిస్థితి లేదని జగనన్న కాలనీ వాసులకు బోలెడు కష్టాలు ఉన్నాయని మాధవరం నుండి దాదాపు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చావని వర్షాలు సరిగా రాకముందే ఇలా అవస్థలు పడుతున్నారు. వర్షాకాలంలో వీరి పరిస్థితి ఏమిటి అని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు మానుకొని మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు సిద్ధవటం సర్పంచ్ ప్రతినిధి ఓబులయ్య లీగల్ అడ్వర్టైజర్ కరుణాకర్ సిద్ధవటం మండల అధ్యక్షులు రాజేష్, ఎం నాగరాజా మౌలాలి బాబి, దినకర్, ఓబులయ్య, ఇదాయత్, ఎం, నాగరాజు, మౌలా, పండ్రా రంజిత్ కుమార్, హేమంత్, గుగ్గీళ్ళ నాగాగ్జున, కోట్టే రాజేష్, పసుపులేటి కళ్యాణ్, రాజా, బాబీ, బాలునాయక్, సుధీర్ నాయక్, దేవకుమార్, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.