మల్లాడి శ్రీకాంత్‌కు జనసేన నేతల ఆదరణ

ఎస్.యానం, యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి నాలుగు సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్న ఎస్.యానం గ్రామానికి చెందిన మల్లాడి శ్రీకాంత్ పరిస్థితిని తెలుసుకున్న జనసేన నాయకుడు సూరపురెడ్డి సురేష్, దంగేటి శ్రీహరి సహకారంతో, మిత్ర కూటమి ప్రభుత్వ నాయకుల చేతుల మీదుగా సోమవారం ఉదయం నెలకు సరిపడ నిత్యవసర వస్తువులను అందజేశారు. దీనితో పాటు జనసైనికుడు లంకే వెంకట్రావు చిన్న సహాయాన్ని అందించారు. అందరి దయా దక్షిణకు శ్రీకాంత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
జనసేన సేవా మానవతా దృక్పథాన్ని ప్రతిబింబించే ఈ చర్య స్థానికంగా ప్రశంసలు అందుకుంది.

Share this content:

Post Comment