వెలుగుబంద సచివాలయంలో జనసేన సోషల్ ఆడిట్

రాజానగరం నియోజకవర్గం వెలుగుబంద సచివాలయం లెక్కల ప్రకారం 812 మందికి ఇళ్ల స్థలాలు కోసం లబ్దిదారులను ఎంపిక చేసారు. కానీ ఇప్పటి వరకు లేఅవుట్ తీయలేదు. స్థలం ఎప్పటికి సెలెక్ట్ చేయాలి? పట్టాలు ఎప్పటికి ఇవ్వాలి? ఇక పాపం లబ్దిదారులు ఇళ్ళు ఎప్పటికి నిర్మించుకోవాలి? జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్వరూప గంటా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.