*సభ్యత్వ నమోదుకు వేగం పెంచిన జనసేన పార్టీ
పాలకుర్తి, పాలకుర్తి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రతి గడపగడపకు తీసుకెళ్లేందుకు ఆగస్టు నెలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ వెల్తూరి నగేష్ ప్రకటించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన క్రియాశీల సభ్యత్వ నమోదు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 10,000 మంది సభ్యత్వం నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం, వారి సమస్యలపై నిలదీయటానికి జనసేన పార్టీ ఆవిర్భవించిందని, ఆంధ్రప్రదేశ్లో జనసేన విజయ సునామి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో యువత పెద్దఎత్తున జనసేనలో చేరిపోతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య సలహాదారు పల్లెర్ల రమేష్, పెద్దవంగర మండల అధ్యక్షుడు దేశెట్టి వెంకటేష్, అలాగే బాలునాయక్, సతీష్, రాజేష్, మణిరాజ్, మహేందర్, రవికృష్ణ, వేణు, శ్రీకాంత్, సందీప్, కళ్యాణ్ యాదవ్, సోమన్న, చిన్న సురేష్, బాలాజీ, మహేష్, సిద్దు, సర్వన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment