చింతలపూడి నియోజకవర్గంలో జనసేనలో భారీ చేరికలు

చింతలపూడి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి చింతలపూడి నియోజకవర్గానికి చెందిన సుమారు 2000 మంది జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని, నూతనంగా జనసేన పార్టీలో జాయిన్ అయిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి.