తిరుపతిలో “జనంతో జనసేన” ఘనంగా ప్రారంభం

త్రుపతి, స్థానిక 33వ డివిజన్ స్యావెంజర్స్ కాలనీ నుంచి ఆదివారం “జనంతో జనసేన” కార్యక్రమం తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బత్తిన మధుబాబు, బాబ్జి, రాజేష్ యాదవ్, ఆకేపాటి సుభాషిని, వనజమ్మ, ముక్కు సత్యవంతుడు, హేమ కుమార్, ఆ వార్డ్ అధ్యక్షుడు బాలాజీ, రాజేష్ ఆచారి, వినోద్, గుట్ట నాగరాజ్, దుర్గ, చందన, సాయిదేవ్, మనోజ్, కిషోర్, చరణ్, సుమన్, బలరాం, రమేష్, హేమంత్, సాయికుమార్, ఆది కేశవులు, కిరణ్, హిమవంత్, సుజిత్, సాయి, విశ్వ, మరియు రాష్ట్ర, జిల్లా, పట్టణ ముఖ్య నాయకులు తో కలిసి ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మరియు మదనపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ రాందాస్ చౌదరి పాల్గొనడంజరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అడుగడుగునా సమస్యలను జనసేన పార్టీ దృష్టికి తీసుకురావటం జరిగింది. సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించుటకు మీకు అండగా ఉండి అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చి పరిష్కరించే వరకు పోరాడుతామని జనసేన నాయకులు స్థానికులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని, రాష్ట్రం మొత్తం అవినీతిమయంలో కురుకుపోయిందని, బీహార్ ను మించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వీటన్నిటిని చక్కదిద్దాలంటే వైసీపీని ఇంటికి పంపించాలని, కచ్చితంగా రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఈసారి జనసేన పార్టీకి అవకాశం కల్పించి, ఏ ఒక్క అవినీతి అక్రమాల మచ్చలేని నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం గల మన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ను చక్కదిద్ది ఆడపడుచులకు అండగా నిలవడమే జనసేన యొక్క ముఖ్య లక్ష్యం అని, పక్క రాష్ట్రాలకు తరలిపోయే వారికి ఉపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చారు.