తాడిపత్రి నియోజవర్గంలో జనసేన ఆత్మీయ సమావేశం

తాడిపత్రి నియోజవర్గంలో నియోజవర్గ స్థాయి మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు చీలకం మధుసూదన రెడ్డి, జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ లు పాల్గొన్నారు, వారు మాట్లాడుతూ మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ,అలాగే అమలు కానీ హామీలను ఇచ్చి ప్రభుత్వం ఈరోజు ప్రజలను తప్పుదోవ పట్టించే పాలన సాగిస్తోందని విమర్శలు చేశారు. అదే విధంగా అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి దాని యొక్క అవసరాన్ని కార్యకర్తలందరికీ తెలియచేసి ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది .అదేవిధంగా అధినేత పవన్ కళ్యాణ్ గారికి రాయలసీమ లో ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం అంటే జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన అభిమానం కలిగి ఉన్నారు. కార్యకర్తలు నాయకులు అందరూ కలసి తాడిపత్రి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయాలని ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు పెండ్యాల హరి, ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య జిల్లా కమిటీ సభ్యులు నాగేంద్ర, తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, నాలుగు మండలాల మండల అధ్యక్షులు, ఏర్రగంగొల్ల శ్రీనివాసులు, దూదేకుల దస్తగిరి, జనసైనికులు నరసింహా చారి, ఆయుబ్, గోపాల్, సాదక్, రసూల్, శ్రీహరి, రమణ తదితరులు పాల్గొన్నారు.