బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని జనసేన డిమాండ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ గత కొద్దిరోజుల క్రితమే విద్యార్థులు తమ యునివర్సిటీ లోని సమస్యలను పరిష్కరించాలని ధర్నా చేశారు. అత్యంత సుదీర్ఘ పోరాటం ద్వారా విజయం సాధించి, కొన్ని రోజులు గడవక ముందే మళ్ళీ మెస్ కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. నాణ్యమైన ఆహారం అందించక పోవడం వల్ల దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయై హాసుపత్రిలో చేరే పరిస్థితి దాపురించింది. కుళ్ళిన కూరగాయలు, కల్తీ నూనె వల్ల తక్కువ ధరలకే విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. విద్యార్థులను పరామర్శించడానికి వెళ్ళిన జన సేన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి కాంట్రాక్టర్లను, దానికి సహకరిస్తున్న అధికారుల పై చట్ట పరమైన చర్యలు తీసుకోనీ, వారిపై క్రిమినల్ కేసులు పెట్టి లైసెన్సులు రద్దు చేయాలని, విద్యార్థులకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే పూర్తి భాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ నిర్లక్ష్యానికి కారణం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. లేనియెడల ప్రభుత్వం మెడలు వంచే విధంగ పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యూత్ నాయకులు రమోజివార్ గంగ ప్రసాద్, బోల్పల్ వాడ్ చంద్రశేఖర్, రోహిత్, మహేష్, దేవిదస్ తదితరులు పాల్గొన్నారు.