పొన్నయుగంధర్ కోలుకోవాలని నిమ్మాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

గంగాధర నెల్లూరు: భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో స్కూటర్ నుండి పడిపోయి కాలు ఫ్యాక్చర్ కావడంతో హాస్పిటల్లో ఉన్న డాక్టర్ పొన్న యుగంధర్ త్వరగా కోలుకోవాలని, తొందరలోనే ప్రజా క్షేత్రంలో ఉండాలని కోరుకుంటూ నిమ్మాలమ్మ గుడిలో పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు గురు స్వామి మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, కోదండన్ జనసైనికులు నరేష్, రంగయ్య, అరుణ్ పాల్గొన్నారు.