ముంపు ప్రాంతాల్లో పులిహోర పొట్లాలు పంపిణీ చేసిన జనసేన

కోనసీమ జిల్లా, పి గన్నవరం నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం ప్రాంత పరిధిలో లంక గ్రామాలకు వరద నేపధ్యంలో చుట్టుముట్టిన వరద నీటితో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రజలకు గుప్పెడు మెతుకులు కరువయ్యాయి. బాధిత ప్రజలకు సకాలంలో ఆహార పొట్లాలను పంపిణీ చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం అయ్యారనే ఆవేదన ప్రజల నుండి వ్యక్తమవుతుంది. ఈ విపత్తును చూసి జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు యర్రంశెట్టివారిపాలెం గ్రామ జనసేన నాయకుడు పెద్దిరెడ్డి సీతారామ్ సహాయంతో సర్పంచ్ మరియు జనసైనికులు ఆధ్వర్యంలో బూరుగులంక ముంపు ప్రాంతాల్లో పులిహోర పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది.